1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. MLC Election Notification issue in Telugu States

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మోగిన ఎన్నికల నగారా!

Andhra Pradesh
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల నగారా మోగింది. ఈసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానికలకు ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా కింద తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లో 3 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి సంబంధించిన షెడ్యూల్‌ నోటిఫికేషన్ జారీ చేసింది. 
 
షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 29న పోలింగ్, కౌటింగ్ నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. కాగా, ఎన్నికల నిర్వహణకు సంబంధించి నవంబర్ 9న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. తాజా నోటిఫికేషన్‌తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఆశావహ నేతలు మంతనాలు మొదలుపెట్టారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
డెహ్రాడూన్ జిల్లాలో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి