శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 30 అక్టోబరు 2021 (11:31 IST)

మాజీ మిస్ తెలంగాణ హాసిని మరోసారి ఆత్మహత్య యత్నం

మాజీ మిస్ తెలంగాణ హాసిని మరోసారి ఆత్మహత్య యత్నం చేసింది. కృష్ణాజిల్లా నందిగామ సమీపంలోని కీసర బ్రిడ్జిపై నుంచి మున్నేరులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. సమీపంలో వున్న స్థానికులు ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు.

 
బుధవారం నాడు హైదరాబాదులో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. ఆరోజు రాత్రి వీడియో ఆన్ చేసింది. లైవ్ లోకి వచ్చి.. ''అమ్మా-నాన్న ఆత్మహత్య చేసుకోవడం తప్పని నాకు తెలుసు. కానీ జీవితంపైన విరక్తి చెందాను. యాసిడ్ దాడి ఎదుర్కొన్నా. ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నా.

 
బతకడం వేస్ట్ అని ఈ నిర్ణయం తీసుకున్నా'' అంటూ మెడకి చున్నీ బిగించి ఫ్యానుకి కట్టింది. ఆమె చేస్తున్న ప్రయత్నాన్ని వారిద్దామని అవతల తల్లిదండ్రులు ఎంత ఫోన్ చేసినా ఆమె పట్టించుకోలేదు. ఐతే ఈ వీడియో చూస్తున్న స్నేహితుడు ఒకరు చురుకుగా స్పందించి 100కి డయల్ చేసాడు. 
 
మెరుపువేగంలో పోలీసులు ఆమె వుంటున్న హైదరాబాదులోని నారాయణగూడ అపార్టుమెంటుకి వెళ్లి తలుపులు బద్దలు కొట్టారు. అపస్మారక స్థితిలో వున్న ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఏమాత్రం ఆలస్యమయినా ఆమె ప్రాణాలు కోల్పోయేవారని వైద్య సిబ్బంది చెప్పారు. కాగా ఆర్థిక సమస్యలే ఆమె ఆత్మహత్య యత్నానికి కారణమని పోలీసులు తెలిపారు.