శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 అక్టోబరు 2021 (11:51 IST)

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌‌కు మాతృ వియోగం

తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ ఇంట విషాదం చోటుచేసుకుంది. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌‌కు మాతృ వియోగం కలిగింది. మంత్రి తల్లి శాంతమ్మ గుండె పోటు తో హైదరాబాద్‌ లో శుక్ర వారం రాత్రి మృతి చెందారు. గత కొంత కాలం నుంచి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తల్లి.. అనారోగ్యంతో బాధ పడుతున్నారు.
 
ఈ నేపథ్యంలో.. ఆమె మృతి చెందారు. ఆమె అంత్య క్రియలు మహబూబ్‌ నగర్‌ పట్టణం లోని వారి వ్యవసాయ క్షేత్రం లో ఇవాళ సాయంత్రం జరుగుతాయని మంత్రి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇక శ్రీనివాస్‌ గౌడ్‌ తల్లి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు.
 
మంత్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ముఖ్య మంత్రి కేసీఆర్‌. రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, లక్ష్మారెడ్డి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, మంత్రి గంగుల తదితరులు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకురాలని పేర్కొన్నారు.