సంబంధిత వార్తలు
- చెప్పుకునేంత ఆసక్తికరంగా నా శృంగారం జీవితం లేదు: తాప్సీ షాకింగ్ కామెంట్
- కేసీఆర్ మంత్రివర్గంలోని సగం మంది తెలంగాణ వద్దన్నవారే.. : ఈటల రాజేందర్
- మీకు మా అయ్య, మా తాత తెలీదు.. ట్రైలర్‌కే ఇంత రచ్చేంద్రా నాయినా..?
- 'క్లౌడ్ బరస్ట్' విదేశీ కుట్ర అయితే, ఆధారాలు కోరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- "క్లౌడ్ బరస్ట్" - ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ : బండి సంజయ్
సీఎం కేసీఆర్‌పై వైఎస్.షర్మిల షాకింగ్ కామెంట్స్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మేఘా కృష్ణా రెడ్డిలపై వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. వికారాబాద్ దుద్యాల గ్రామంలో జరిగిన మాటా ముచ్చట కార్యక్రమంలో వైఎస్ షర్మిల పాల్గొని... ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను సీఎం కేసీఆర్ మేఘా కృష్ణారెడ్డికి అప్పగించి, చేతికి వచ్చినంతగా దోచు కుంటున్నారని ఆమె ఆరోపించారు.
సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, పాలమూరు-రంగారెడ్డితో పాటు మేజర్ నుంచి మైనర్ ప్రాజెక్టులను మేఘా కృష్ణారెడ్డికి కేటాయించారని అన్నారు.
కేసీఆర్‌కు క్రిష్ణారెడ్డి భాగస్వామి అని, కృష్ణారెడ్డి నుంచి కేసీఆర్ కుటుంబానికి కమీషన్లు వస్తాయని ఆమె అన్నారు. బాసర ఐఐఐటీలో నాణ్యత లేని ఆహారాన్ని అందజేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు.