గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2022 (09:22 IST)

జమ్మూకాశ్మీర్‌ రాజౌరీలో ఉగ్రదాడి.. ముగ్గురు సైనికులు మృతి

terrorist
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని రాజౌరీ సమీపంలో ఉగ్రదాడి జరిగింది. ఇందులో ముగ్గురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పర్గల్ వద్ద సైనిక శిబిరంలోకి ముష్కరులు ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అది విఫలం కావడంతో తమను తాము పేల్చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇంతలో అప్రమత్తమైన సైనికులు ఉగ్రవాదలు ప్లాన్‌ను తిప్పికొట్టింది. 
 
రాజౌరీ ప్రాంతానికి 25 కిలోమీటర్ల దూరంలో పర్గల్ ఆర్మీ క్యాంపు వద్ద ఈ దాడి జరిగింది. సైనిక శిబిరంలోకి ప్రవేసించేందుకు ముష్కరులు ప్రయత్నించగా, దీన్ని సైనికులు గుర్తించి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. 
 
అలాగే, ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం అక్కడ మరికొంతమంది ఉగ్రవాదులు ఉండొచ్చన్న అనుమానంతో భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే, పర్గల్ ప్రాంతానికి పెద్ద ఎత్తున సైనిక బలగాలను తరలిస్తున్నారు.