అండర్‌వాటర్ మెట్రో సర్వీస్_జూన్ 2023కల్లా పూర్తి
ఈస్ట్-వెస్ట్ కారిడార్ ప్రాజెక్ట్ అయిన అండర్‌వాటర్ మెట్రో సర్వీస్‌ను జూన్ 2023కల్లా పూర్తి చేయనున్నారు. కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
కోల్‌కతా మీదుగా సాల్ట్ లేక్ నుంచి హౌరాహ్ ప్రయాణించే ఈ మెట్రో రైలు హుగ్లీ నదిలోపల ప్రయాణించనుంది. ప్రస్తుతం ఈ మెట్రో ట్రైన్ ను సెక్టార్ వీ నుంచి సీల్దాహ్ స్టేషన్ల మధ్య నడిపిస్తున్నారు.
మొత్తం 16.55కిలోమీటర్ల ప్రాజెక్ట్ కాగా సెక్టార్ వీ నుంచి సీల్దా వరకూ ఆల్రెడీ ఆపరేషన్‌లో ఉంది. మిగిలిన 7.25 కిలోమీటర్లు సంవత్సరం లోగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే చాలా మంది ప్రయాణికులకు సౌలభ్యం దొరుకుతుంది. అండర్‌గ్రౌండ్ సెక్షన్ 10.8 కిలోమీటర్లు మాత్రమే ఉన్నా.. ఎలివేషన్ కోసం మరో 5.8కిలోమీటర్లు అదనంగా ఏర్పాటు చేయనున్నారు.
సొరంగం పనుల కారణంగా ముందుగా డిసెంబర్ 2021 కల్లా పూర్తి కావాలనుకున్న ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. అండర్‌గ్రౌండ్ వర్క్ కారణంగా గత మూడేళ్లలో చాలా ఇళ్లపై పగుళ్లు రావడం జరిగిందని అధికారులు తెలిపారు.