1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా తగ్గిన పాజిటివ్ కేసులు

covid test
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒక్కసారిగా తగ్గిపోయాయి. గత 24 గంటల్లో 12751 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే, 42 మంది చనిపోయినట్టు తెలిపింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 131807 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు.. గత 24 గంటల్లో 12,751 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 16,412 మంది కోలుకోగా... 42 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల కంటే కోలుకున్న వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. 
 
ప్రస్తుతం దేశంలో పాజటివిటీ రేటు 3.50 శాతంగా, రికవరీ రేటు 98.51 శాతంగా, క్రియాశీల రేటు 0.30 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటివరకు 2,06,88,49,775 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 31,95,034 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.