సోమవారం, 7 అక్టోబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2022 (11:34 IST)

ఒకే రోజు ఐదు స్వర్ణాలతో అదరగొట్టిన భారత్.. క్రికెట్‌లో రజతం

Team India
కామన్వెల్త్ క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిల క్రికెట్ జట్టు దేశానికి రజత పతకాన్ని అందించింది. పసిడి పతకం కోసం ఆస్ట్రేలియాతో జరిగిన తుది పోరులో చివరి వరకు పోరాడి ఓడింది. ఫలితంగా ‘రజతం’తో సరిపెట్టుకుంది. గత రాత్రి ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. 
 
అనంతరం 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్ సేన మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 152 పరుగులకు ఆలౌట్ అయింది. హర్మన్‌ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. 43 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 65 పరుగులు చేయగా, జెమీమా రోడ్రిగ్స్ 33 పరుగులు చేసింది. చివరి వరుస బ్యాటర్లు విఫలం కావడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో ఆష్లీ గార్డెనర్ 3, మెగాన్ షట్ రెండు వికెట్లు తీసుకున్నారు.
 
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. ఈ విజయంతో ఆస్ట్రేలియాకు స్వర్ణ పతకం దక్కగా, భారత్ రజతంతో సరిపెట్టుకుంది. మరోవైపు, ఇంగ్లండ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన న్యూజిలాండ్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
 
భారత బౌలర్లలో రవి భిష్ణోయ్ 2.4 ఓవర్లు వేసి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా అక్షర్ పటేల్ ఎంపికవగా.. మ్యాన్ ఆఫ్ది సిరీస్ అవార్డును అర్హ్ దీప్ సింగ్ దక్కించుకున్నాడు. 
 
మరోవైపు కామన్వెల్త్ గేమ్స్ చివరి దశకు చేరుకున్న వేళ భారత ఆటగాళ్లు అదరగొట్టారు. భారత బాక్సర్లు ఒకే రోజు మూడు స్వర్ణాలను సంపాదించి పెట్టారు. నిఖత్ జరీన్, అమిత్ పంగల్, నితూ గంఘూస్ బంగారు పతకాలు సాధించారు. టేబుల్ టెన్నిస్‌లో ఆచంట శరత్ కమల్-శ్రీజ జోడీ స్వర్ణం సాధించింది.