గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2022 (16:09 IST)

కామన్వెల్త్ గేమ్స్‌: సింధు స్వర్ణంతో.. 19కి చేరిన పతకాలు

CWG
CWG
కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా భారత్ ఖాతాలో పసిడి పతకాల సంఖ్య 19కి చేరింది. తొలి గేమ్‌లో సింధు పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. అన్ని ర‌కాల షాట్ల‌ను ఆడింది. ప్ర‌త్య‌ర్థిని ముప్పుతిప్పులు పెట్టింది. మిచ్చెలి లీ ప్ర‌పంచ నెంబ‌ర్ 14వ‌ ర్యాంక్ కాగా, సింధు వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్‌లో ఉన్న సంగతి తెలిసిందే. 
 
సోమవారం సింధు సాధించిన స్వర్ణంతో పాయింట్ల పట్టికలో భారత్‌ ఓ అడుగు ముందుకేసింది. న్యూజిలాండ్‌ను దాటేసి నాలుగో స్థానానికి చేరుకుంది. 19 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్యాలతో మొత్తం 56 పతకాలు కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, కెనడా మనకన్నా ముందున్నాయి.