సంబంధిత వార్తలు
- కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?
- శభాష్ ముకేష్ కుమార్ మీనా, ప్రజాస్వామ్యానికి ఆయన ఓ బంగారు మెట్టు
- why not 175 కాదట Now 120 అంట, వైసిపి కొత్త లెక్కలు- మరోసారి ఆంధ్రకి సీఎంగా జగన్
- నంద్యాలలో వై.సి.పి. అభ్యర్థి రవి చంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ ప్రచారం
- జగన్ ఫోటో వున్న పట్టాదారు పాసు పుస్తకాన్ని చించి తగలబెట్టిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ 151కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని ప్రకటించారు. పొత్తుల విషయానికి వస్తే, టీడీపీ+ కూటమి ఎన్ని సీట్లు గెలుస్తుందనే దానిపై కాస్త క్లారిటీ వుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. టీడీపీ+ ఎలా ఉన్నా 100-120 సీట్లు సునాయాసంగా దక్కించుకోవడం ఖాయమని కూటమి నేతలు అంటున్నారు.
మిత్రపక్షాల సాయం లేకుండా టీడీపీకి మెజారిటీ మార్కు ఉంటుంది. ఎలాగైనా, కూటమికి అనుకూలమైన విజయం వుంటుందని టాక్ వస్తోంది. ప్రతి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ఎన్ని ఓట్లు పోలయ్యాయన్న దానిపై కింది స్థాయి నాయకత్వం ఇప్పటికే ఆయా అభ్యర్థుల వద్ద లెక్కలు వేస్తోంది.
నియోజకవర్గాల వారీగా పక్కగా 17ఏ ద్వారా పోలైన ఓట్లు తెలిస్తే మరింత స్పస్టత రానుందని టీడీపీ వర్గాలద్వారా సమాచారం. ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి నియోజకవర్గాల నుంచి సమాచారాన్ని రాష్ట్ర కార్యాలయానికి అందజేస్తున్నారు.
