శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 6 మే 2024 (20:00 IST)

జగన్ ఫోటో వున్న పట్టాదారు పాసు పుస్తకాన్ని చించి తగలబెట్టిన చంద్రబాబు

Chandrababu Naidu
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోటో వున్న పాసు పుస్తకం కాపీని చించి తగులబెట్టారు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు. రకరకాల చట్టాలతో ప్రజల భూములను కాజేసేందుకు వైసిపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది తమ్ముళ్లూ జాగ్రత్త అంటూ మండిపడ్డారు.
 
పట్టాదారు పాసుపుస్తకంపైన జగన్ తన బొమ్మ వేసుకోవడానికి అదేమైనా ఆయన అబ్బ సొత్తా అని ప్రశ్నించారు. ఆ బొమ్మ వున్న పాసు పుస్తకాన్ని సభాముఖంగా చించిపారేసి తగలబెడుతున్నా అని ప్రజలకు చూపిస్తూ నిప్పు పెట్టారు.

3 రాజధానులన్నారు, ఒక్క రాజధాని కూడా లేకుండా చేసారు: ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రాజమండ్రి, అనకాపల్లి సభల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వైసిపి ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఆయన మాట్లాడుతూ... ''మూడు రాజధానులు అన్నారు. కనీసం ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారు. మూడు రాజధానుల పేరిట దోచుకుని ఖజానా ఖాళీ చేస్తున్నారు.
 
వైసిపివాళ్లకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రాదు కానీ కరెప్షన్ మేనేజ్మెంట్ మాత్రం అద్భుతంగా చేస్తారు. ఆంధ్రప్రజలు వైసిపికి ఐదేళ్ల సమయం ఇచ్చారు. కానీ ఆ పార్టీ పూర్తిగా ఆ సమయాన్ని వృధా చేసుకున్నది. ఇక ఆ పార్టీని భరించే శక్తి ఆంధ్ర ప్రజలకు లేదు. జగన్‌కు తన తండ్రి రాజకీయ వారసత్వం కావాలి కానీ కనీసం ఆయన మొదలు పెట్టిన ప్రాజెక్టులు కూడా పూర్తి చెయ్యలేదు. ఎన్డీయే నినాదం అభివృద్ధి అయితే వైసిపి ప్రభుత్వం నినాదం అవినీతి.
 
ఏపీ అభివృద్ధిపథంలో నడవాలంటే మీరందరూ ఎన్డీయే అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి. తెలుగుదేశం, జనసేన అభ్యర్థులకు ఘన విజయం అందించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలనాడు శ్రీ ఎన్టీ రామారావు గారు శ్రీరాముడిగా నటించారు. బీజేపీ అయోధ్యలో రామాలయాన్ని నిర్మించింది అని అన్నారు.