1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Inter student suicide attempt in west godavari

వాడు నన్ను గదికి రమ్మంటున్నాడు.. చనిపోతున్నా.. ఇంటర్ విద్యార్థిని

West Godavari
ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని మోరిపోడులో ఓ యువకుడి వేధింపులను భరించలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మరణించేందుకు ముందు తల్లికి యువతి రాసిన లేఖ లభించినట్లు పోలీసులు వెల్లడించారు. కానీ వేధింపులకు పాల్పడిన ఆ యువకుడు ఎవరనేదీ తెలియరాలేదు.
 
తాను తప్పు చేయలేదని.. బతకాలని వున్నా.. వాడు బతకనివ్వట్లేదని.. తన గదికి రావాలంటున్నాడని ఆ లేఖలో ఇంటర్ విద్యార్థిని రాసుకొచ్చింది. అలా రాకపోతే.. తన ఫోటోలు బయటపెడతానని బెదిరిస్తున్నానని తెలిపింది. ఆ ఫోటులు బయట పెట్టకపోవడం వల్లే తన ఆత్మకు శాంతి అని.. ఆ యువకుడిని ఏమీ చేయవద్దని ప్రాధేయ పడుతూ ప్రాణాలు విడిచింది.
 
అయితే ఈ ఘటనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలు మహిళా సంఘాలు కోరుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
భార్యను వివస్త్రను చేసి ఇంటి నుంచి గెంటేశాడు.. ఆమె ఏం చేసిందంటే?