సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (12:08 IST)

చాక్లెట్లు దొంగిలించాడనీ... డీమార్ట్ సిబ్బంది దాడి.. ఇంటర్ విద్యార్థి మృతి

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్‌ చదువుతున్న విద్యార్థి ఎల్‌. సతీష్‌(17) వనస్థలిపురంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. వనస్థలిపురంలోని డీమార్ట్‌లో షాపింగ్‌ చేయడానికి ఆదివారం తన స్నేహితులతో వెళ్లిన సతీష్‌కు సెక్యూరిటీతో గొడవ ఏర్పడింది. 
 
డీమార్టులో చాక్లెట్‌ దొంగిలించాడని విద్యార్థిపై సిబ్బంది దాడికి దిగారు. కాసేపటికి సతీష్‌ మృత్యువాత పడ్డాడు. దీంతో సెక్యూరిటీ వారు దాడి చేయడం వల్లే తన కొడుకు మరణించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 
 
కాగా హయత్‌నగర్‌లోని శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాలలో సతీష్‌ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రుల అనుమతి లేకుండానే సతీష్‌ను కళాశాల యాజమాన్యం బయటకు పంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.