గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (21:14 IST)

లైట్ మెట్రో రవాణా బెటర్: టీటీడీ చైర్మన్ వైవీతో హైద్రాబాద్ మెట్రో రైల్వే ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

మెట్రో రైల్
తిరుపతి నుంచి తిరుమల మార్గంలో రద్దీ తగ్గించడానికి లైట్ మెట్రో వాహన విధానం బావుంటుందని హైద్రాబాద్ మెట్రో రైల్వే ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం శ్రీ పద్మావతీ అతిథి గృహంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. 
తిరుపతి, తిరుమలలో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు చేపట్టాల్సిన అంశాల గురించి చర్చించారు. తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా రవాణా మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన అంశాలు, అలాగే రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి వరకు సుందరీకరణ గురించి చర్చించారు. 
 
భవిష్యత్తులో తిరుపతి, తిరుమలను అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక దివ్యకేంద్రాలుగా తీర్చిదిద్దడానికి టీటీడీ అధికారులతో కలిసి పూర్తిస్థాయి నివేదిక తయారుచేయాలని సుబ్బారెడ్డి సూచించారు.