గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శనివారం, 15 ఫిబ్రవరి 2020 (20:52 IST)

హైదరాబాద్‌కు చేరుకున్న గల్ఫ్ బాధితులు... కేటీఆర్ దయవల్లే ఇక్కడకి...

నకిలీ ఏంజట్ల చేతిలో నిలువునా మోసపోయి అరబ్ దేశమైన ఇరాక్‌లో చిక్కుకున్న 16 మంది తెలంగాణ వాసులు తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. శంషాబాద్‌లో తమ వారిని చూసి బోరున విలపించారు. ఇరాక్‌లో చిక్కుకొని అనేక బాధలు పడ్డామని, తినడానికి తిండి లేక ఎన్నో రోజులు పస్తులు ఉండాల్సి వచ్చిందని, గత నాలుగు సంవత్సరాలు ఎన్నో బాధలు అనుభవించామని మీడియాతో తమ గోడును వివరించారు.
 
ఇరాక్‌లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి నిలువునా ఏంజట్లు మోసం చేసారని ఆరోపిస్తున్నారు. మమ్మల్ని తెలంగాణకు రప్పించడానికి తెలంగాణ మంత్రి కె. తారకరామారావు ప్రత్యేక చొరవ చూపారని ఆయన దయ వల్లే మేము క్షేమంగా హైదరాబాదుకు చేరుకున్నామని కన్నీరు పెడుతూ మీడియాకు వివరించారు.