పట్టాలు తప్పిన కోల్‌కతా - సైరంగ్ ఎక్స్‌ప్రెస్ (వీడియో)
అస్సాం రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. కోల్‌కతా - సైరంగ్ ఎక్స్‌ప్రెస్ రాష్ట్రంలోని కామ్‌రూప్ జిల్లాలోని డిగార్ రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదానికి గురైంది. ప్రయాణికులు ఉన్న ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. దీనిపై నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే సీపీఆర్వో మాట్లాడుతూ ఈ ఘటన గురువారం ఉదయం 6.54 సమయంలో చోటుచేసుకొన్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఇప్పటికే సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి బయల్దేరారు.
గౌహతికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇంజిన్‌తో సహా ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి. గౌహతి స్టేషన్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే రైలు ప్రమాదానికి గురైంది. ఈ రైలు మంగళవారం ఉదయం కోల్‌కతా స్టేషన్ నుంచి బయల్దేరింది. ఇది నేటి మధ్యాహ్నానికి మిజోరంలోని సైరంగ్‌కు చేరుకోవాల్సి ఉంది. ఈ రైలు ఒక లైన్ నుంచి మరో లైన్‌కు మారుతున్న వేళ తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా పట్టాలు తప్పి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
BREAKING ???? In Assam, Kolkata-Sairang Express Derails Near Digaru, 7 Coaches Go Off Track According to the initial report, the derailment took place near Digaru, prompting the deployment of rescue teams and railway personnel to the spot. Three injured passengers were shifted to Sonapur District Hospital for medical treatment. This doesnt looks like simple derailment, must look into sabotage aspect, as once again train derailment and train accidents increased in last few days across India.
— Oxomiya Jiyori ???????? (@SouleFacts) November 11, 2026

