1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Actor Sivaji allegations on BJP over AP Special Status

నాకు ప్రాణహాని... బాబును లోపలేయాలని చూస్తున్నారు... శివాజి చెప్పేది నిజమా?

ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న నటుడు శివాజీ తాజాగా తనకు ప్రాణహాని వున్నదంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటికే రెండుసార్లు అని మధ్యలోనే విషయాన్ని ఆపేశారు. ఆ రెండుసార్లు ఏం జరిగిందన్నది ప్రశ్న. ఇకపోతే తన ప్రాణాలు పోతాయన్న భయం తనకు లేదనీ, ఐ

Actor Sivaji
ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న నటుడు శివాజీ తాజాగా తనకు ప్రాణహాని వున్నదంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటికే రెండుసార్లు అని మధ్యలోనే విషయాన్ని ఆపేశారు. ఆ రెండుసార్లు ఏం జరిగిందన్నది ప్రశ్న. ఇకపోతే తన ప్రాణాలు పోతాయన్న భయం తనకు లేదనీ, ఐతే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతటి త్యాగానికైనా తను సిద్ధమేనని చెప్పారు. ఏపీలో ఆపరేషన్ గరుడ రూటును భాజపా మార్చుకుని వేరే రూట్లో రాబోతోందని ఆరోపించారు.
 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఏదోవిధంగా ఇరుకున పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందనీ, ఈ క్రమంలోనే ఇటీవల తిరుమలలో ఏదో అయిపోయిందంటూ గోల చేశారన్నారు. తిరుమల గురించి గందరగోళం సృష్టించి చంద్రబాబును ఇబ్బందిపెట్టాలని చూశారని ఆరోపించారు. వచ్చే సోమవారం నాడు చంద్రబాబు నాయుడికి ఓ జాతీయ సంస్థ నోటీసు ఇవ్వబోతోందంటూ సంచలన వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలో భాజపాను, దానిపై వున్న నమ్మకాన్ని భాజపా నాయకులే చంపేశారంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇదిలావుంటే నటుడు శివాజీ చేస్తున్న ఆరోపణలు నిజమా కాదా అనే చర్చ జరుగుతోంది.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
కోట్లు దాటుతున్న శ్రీవారి అన్నప్రసాదం.. తిరుమలేశా... గోవిందా...