1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AP Minister Botsa Satyanarayana statement on Muncipal Election

పురపాలక, నగరపాలక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు : మంత్రి బొత్స

Botsa Satyanarayana
రాష్ట్రంలోని పురపాలక, నగర పాలక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని ఏపీ రాష్ట్ర పురపాలక శాఖామంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ, రాష్ట్రంలోని 109 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. 
 
జీఎంసీలో విలీనం చేసే గ్రామాల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. విలీన  గ్రామాలపై గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఇలాంటి పరిస్థితే ఉందన్నారు. సమస్యలన్నింటినీ పరిశీలించి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కొన్ని కార్పొరేషన్లకు కోర్టు కేసులు ఉన్నాయని, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. 
About Writer
ఎం
తర్వాతి కథనం
హయత్ నగర్ కిడ్నాప్ కేసు సుఖాంతం..