మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శనివారం, 11 మే 2019 (15:53 IST)

నచ్చిన వాడితో పడుకుంటా.. బోర్ కొడితే వదిలేస్తా... 'ఫిదా' నటి గాయత్రి

ఫిదా సినిమాలో సాయిపల్లవికి స్నేహితురాలిగా నటించిన గాయత్రి గుర్తుంది కదా. ఓణీ కట్టుకుని సాయిపల్లవి చుట్టూ తిరుగుతుంటుంది. గాయత్రి ఈమధ్య క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా మాట్లాడటం చర్చకు తెరలేపింది. తాజాగా ఆమె చెప్పిన మాటలు కూడా సినీపరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
 
పెళ్ళి. ఇది ఒక బోర్. నా స్నేహితులు కొంతమంది పెళ్లిళ్లు చేసుకుని ఎందుకు చేసుకున్నామా అని బాధపడుతున్నారు. మొదటి సంవత్సరం హనీమూన్ అని బాగా ఎంజాయ్ చేస్తారు. రెండవ సంవత్సరం ఫ్రెండ్స్‌లా ఉంటారు. మూడు, నాలుగు సంవత్సరాల్లో పిల్లలు పుడతారు. ఇక వారిని చూసుకోవడమే సరిపోతుంది. ఇదంతా బోర్. ఒకరితో పడుకుని జీవితాంతం గడపడం కన్నా సహజీవనం చేయడం ఎంతో మేలు.
 
సుప్రీంకోర్టు సహజీవనాన్ని తప్పుబట్టేలేదు. నేను అయితే అదే చేస్తాను. ఇష్టమొచ్చినవాడితో డేటింగ్ చేస్తా. ఆ తరువాత బోర్ కొడితే వదిలేస్తాను. అంతేగానీ పెళ్ళి, గిళ్లి అని మాత్రం నేను చేసుకోను అని తెగేసి చెబుతోంది గాయత్రి. సినిమాలు చేతిలో లేకపోయినా గాయత్రి తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీపరిశ్రమలో చర్చకు దారితీస్తోంది.