సంబంధిత వార్తలు
- మహిళలు 40ల్లోనే ఆ విషయంలో మాంచి రసపట్టుగా వుంటారు... విద్యా బాలన్
- ఆ నిర్మాత 'ఆఫర్ ఇస్తా.. మరి నాకేంటి' అని అడిగారు : పాయల్ రాజ్‌పుత్
- నన్ను 45 సార్లు అలా వాడేశారు... RX 100 హీరోయిన్ పాయల్ రాజ్
- పెళ్ళి కన్నా సహజీవనమే బెస్ట్... డేటింగ్ చేసి బోర్ కొట్టేసింది: మాధవీలత
- ఆఖరికి మహేష్.. వెంకీని నమ్ముకున్నాడు... నిజం ఒప్పుకున్నాడు..!
పాత్ర డిమాండ్ మేరకే బోల్డ్‌గా నటిస్తున్నాం : లక్స్ పాప
పాత్ర డిమాండ్ మేరకే బోల్డ్ సన్నివేశాల్లో నటిస్తున్నట్టు హీరోయిన్ ఆశా సైనీ అలియా ఫ్లోరా సైనీ వెల్లడించారు. 'నువ్వు నాకు నచ్చావ్' అనే చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన ఈమె.. ఆ తర్వాత బాలకృష్ణ నటించిన 'నరసింహనాయుడు' చిత్రంలో లక్స్ పాప అంటూ అందాలు ఆరబోసింది.
తెలుగులో అంతగా అవకాశాలు రాకపోవడంతో ఆశా సైనీ.. తన పేరును ఫ్లోరా సైనీగా మార్చుకుని బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ప్రధానంగా హిందీ సినిమాలపైనే దృష్టిపెడుతూ తమిళ, కన్నడ సినిమాలను కూడా చేస్తూ వెళుతోంది.
అదేసమయంలో 'పెద్దలకు మాత్రమే' అనే షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా నటిస్తూ వస్తోంది. దాంతో అంతా ఆమెను బోల్డ్ హీరోయిన్‌గా పిలవడం మొదలుపెట్టారు. ఈ విషయంపైనే ఆమె తాజాగా మీడియాకి చిన్నపాటి క్లాస్ పీకింది.
'నటి అన్న తర్వాత రకరకాల పాత్రలను చేస్తూ మా ప్రతిభను నిరూపించుకోవలసి ఉంటుంది. పాత్ర డిమాండ్‌ను బట్టి కొన్ని బోల్డ్ సీన్స్ కూడా చేయవలసి ఉంటుంది. అంత మాత్రానికే చీప్‌గా చూస్తారా? నన్ను బోల్డ్ హీరోయిన్ అన్నంత తేలికగా, నాతో కలిసి శృంగార సన్నివేశాల్లో నటించే హీరోలను బోల్డ్ యాక్టర్ అని పిలిచే దమ్ముందా?" అంటూ తీవ్రమైన అసహనాన్ని వ్యక్తంచేసింది.
తర్వాతి కథనం
