శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 30 నవంబరు 2018 (14:19 IST)

ఆ నిర్మాత 'ఆఫర్ ఇస్తా.. మరి నాకేంటి' అని అడిగారు : పాయల్ రాజ్‌పుత్

"ఆర్ఎక్స్ 100" చిత్ర హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. తాను నటించిన తొలి చిత్రంలోనే బోల్డ్ క్యారెక్టర్‌లో నటించి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా, ఆమె అందాల ఆరబోతకు కుర్రకారు ఫిదా అయిపోయింది. ఆ తర్వాత ఆమెకు అనేక చిత్రాల్లో ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ, వాటిని సున్నితంగా తిరస్కరించింది. అదేసమయంలో ఆమెకు కూడా క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందట. 
 
దీనిపై పాయల్ రాజ్‌పుత్ స్పందించారు. చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్నమాట నిజమే. ఇది బహిరంగ రహస్యం. అయితే నటిగా నిరూపించుకున్న తర్వాత కూడా క్యాస్టింగ్ కౌచ్ భూతం నన్ను వెంటాడటం తనను బాధిస్తోంది. తన తొలి చిత్రం ఆర్ఎక్స్‌ 100లో బోల్డ్ క్యారెక్టర్ చేయడం వల్లే వేధింపులు ఎక్కువయ్యాయని అనుకుంటున్నాను. 
 
ఈ చిత్రం తర్వాత తనకు అలాంటి ఆఫర్లే వచ్చాయి. ఇటీవల అలాంటి ఆఫర్‌తోనే ఓ నిర్మాత తన వద్దకు వచ్చారు. 'నేను ఆఫర్ ఇస్తా.. మరి నాకేంటి' అని ప్రశ్నించాడు. ఆ మాట వినగానే నేను ఒకింత షాక్‌కు గురయ్యా. గట్టిగా రెండు చెంపలు వాయించాలని అనిపించింది. కానీ, ఆ సమయంలో నన్ను నేను నిగ్రహించుకున్నాను. ఒక నటిగా ఇక్కడ ఉన్నానంటే అది నా టాలెంట్. తొలి చిత్రంలో ముద్దు సన్నివేశాల్లో నటించినందుకు తనకు గుర్తింపు రాలేదని ముఖంపై చెప్పి ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్టు పాయల్ రాజ్‌పుత్ వివరించింది.