1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 మే 2025 (14:14 IST)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Quetta
Quetta
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్‌ ఆర్మీకి చుక్కలు చూపిస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ బయటకు వెళ్తే, ప్రాణాలతో తిరిగి వస్తారనే గ్యారెంటీ లేకుండా చేస్తోంది. తాజాగా పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ రాజధాని అయిన క్వైట్టాను బీఎల్ఏ ఆధీనంలోకి తీసుకుంది. బలూస్తాన్‌లోని పాక్ రెబల్స్- పాక్‌లోని ప్రధాన భూభాగమైన బలూచిస్తాన్‌ను స్వాధీనం చేసుకుందని టాక్ వస్తోంది. 
 
గతంలో బలూచ్ ఆర్మీ పాక్ రైలును హైజాక్ చేసిన పాకిస్థాన్‌కు చెందిన ఆర్మీ వాళ్లను మిలటరీ అధికారులను పిట్టలను కాల్చినట్టు కాల్చిపడేసింది. ఇప్పటికే బలూచ్ లోని చాలా ప్రాంతాల్లో పాక్ ప్రభుత్వ నియంత్రణ లేదు. 
 
అక్కడ పాక్ ఆర్మీ అడుగుపెట్టాలంటే భయపడే పరిస్థితులు నెలకున్నాయి. ఈ ప్రాంతంలో ఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ నుండి స్వాతంత్రం పొందామని బలూచ్‌‌ ప్రకటన ఆసక్తి కరంగా మారింది. తాజాగా క్వైట్టాను బలూచిస్థాన్ స్వాధీనం చేసుకుందని సమాచారం వస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.