శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్ దళవాయి
Last Modified: శుక్రవారం, 31 మే 2019 (20:12 IST)

సల్మాన్‌తో నేను నటించడం వేస్ట్... ఎందుకంటే? దిశా పటాని

సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశం కోసం చాలా మంది హీరోయిన్లు ఎదురు చూస్తుంటారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం ఇకపై సల్మాన్ పక్కన నటించబోనని తెగేసి చెప్పేసింది. సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'భారత్' సినిమా విషయంలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 
 
ఈ సినిమాకు హీరోయిన్‌గా ముందు ప్రియాంక చోప్రాను అనుకున్నారు. కానీ, ఆమె అనూహ్యంగా తప్పుకోవడంతో చివరి నిమిషంలో కత్రినా కైఫ్‌ను తీసుకున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తయి, జూన్ 5వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సమయంలో ఈ సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది.  
 
సల్మాన్ ఖాన్‌కు జోడిగా కత్రినా కైఫ్‌తో పాటు దిశా పటాని నటించింది. ఈ సినిమా తర్వాత సల్మాన్ ఖాన్‌తో ఇకపై నటించబోనని స్పష్టంగా చెప్పేసింది. ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం మాత్రం చెప్పడం లేదు. అయితే సల్మాన్ ఖాన్ పక్కన తాను చిన్న పిల్లలా కనిపిస్తున్నానని అందుకే ఇకపై సల్మాన్‌తో సినిమా చేయనని కవర్ చేస్తోంది.