1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. APSRTC Driver Averts Mishap After Acid Can Bursts

యాసిడ్ క్యాన్ పేలింది.. APSRTC డ్రైవర్ పుణ్యంతో పెను ప్రమాదం తప్పింది..

APSRTC
కడప జిల్లాలోని టి. చాదిపిరళ్ల గ్రామం సమీపంలో, కడప డిపోకు తరలిస్తున్న యాసిడ్ క్యాన్ ఒకటి అకస్మాత్తుగా పగలడంతో ఏపీఎస్సార్టీసీ బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతపురానికి చెందిన ఒక కార్గో సంస్థకు సంబంధించిన యాసిడ్ క్యాన్లను ఈ బస్సులో తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. 
 
టి. చాదిపిరళ్ల శివార్లకు బస్సు చేరుకోగానే, ఆ క్యాన్లలో ఒకటి పగిలిపోవడంతో బస్సు లోపల పొగలు వ్యాపించాయి. అనేక మంది ప్రయాణికులు కళ్లలో మంట, చికాకుగా ఉన్నట్లు ఫిర్యాదు చేశారు. పొగలు రావడం గమనించిన ఒక ప్రయాణికుడు వెంటనే డ్రైవర్, కండక్టర్‌ను అప్రమత్తం చేశారు. 
 
డ్రైవర్ వెంటనే స్పందించి బస్సును రోడ్డు పక్కన నిలిపి, ప్రయాణికులందరూ సురక్షితంగా దిగేలా చేశారు. ఆ తర్వాత వాహనం నుండి యాసిడ్ డబ్బాలను తొలగించారు. డ్రైవర్ సమయస్ఫూర్తి, తక్షణ చర్యల వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కమలాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి?