1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Concern of corona patients in Kurnool

కర్నూలులో కరోనా రోగుల ఆందోళన

Concern
సమయానికి భోజనం పెట్టడం లేదంటూ కర్నూలు విశ్వ భారతి కోవిడ్ ఆస్పత్రిలో కరోనా రోగులు మంగళ వారం మధ్యాహ్నం ఆందోళన చేపట్టారు. 3 గంటలైనా భోజనం ఇవ్వక పోవడంతో ఆగ్రహించిన రోగులు ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి నిరసన తెలిపారు.

విధుల్లో ఉన్న సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సోమవారం రాత్రి 10.30 సమయంలో తమను ఒక భవనం నుండి మరో భవనానికి తరలించారని, దాంతో రోగులందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం కూడా 10.40 వరకూ టిఫిన్ ఇవ్వలేదని, షుగర్, బిపి ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారని తెలిపారు.

ఆస్పత్రి యాజమాన్యం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. రోగులు భోజనం విషయం ఆందోళన చేస్తే వెళ్ళిపోయెందుకు ఆసక్తి ఉన్న వాళ్ళు పేర్లు ఇస్తే డిశ్చార్జి చేస్తామని సిబ్బంది పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో రోగులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. చివరికి భోజనాలు రావడంతో కాస్త శాంతించారు.
తర్వాతి కథనం
కరోనా దెబ్బకు ఉద్యోగం ఊడింది... ఆ టెక్కీకి సోనూ సూద్ ఉద్యోగమిచ్చారు..