శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 24 జులై 2020 (06:40 IST)

తిరుపతిలో కనిపించని 236 మంది కరోనా పేషేంట్లు!

తిరుపతి కరోనా పాజిటివ్ కేసుల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. కరోనా స్వాబ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చాక బాధితులు ఆసుపత్రుల్లో చేరడం లేదు. స్వాబ్ టెస్ట్ కోసం శాంపిల్స్‌ తీసుకునే సమయంలో కొంతమంది రాంగ్ ఫోన్ నంబర్, తప్పుడు అడ్రస్‌ని ఇస్తున్నారు.

టెస్ట్‌ల్లో పాజిటివ్ వచ్చాక వారికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లేదా రాంగ్ నంబర్ అని వస్తోంది. ఇక చిరునామాకు వెళ్తే అది వారి అడ్రస్ కాదని తెలుస్తోంది.

ఇలా గత పదిరోజుల్లో 236మంది కరోనా పాజిటివ్ బాధితుల ఆచూకీ లభించలేదు. దీంతో అధికారులు తలలు పట్టు కుంటున్నారు.

పాజిటివ్ వచ్చినప్పటికీ వారు జనాల్లోనే తిరుగుతున్నట్టుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వీరిపై అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ భత్‌ నారాయణ విచారణ వ్యక్తం చేస్తున్నారు.