సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 26 జులై 2020 (09:46 IST)

బెంగళూర్‌లో 3 వేలమంది కరోనా రోగులు పరారీ

కరోనా నుంచి ప్రజల్ని కాపాడడమెలా అని మదనపడుతున్న అధికారులకు సరికొత్త తలనొప్పి ఎదురవుతోంది. అనేక మంది కరోనా పాజిటివ్ వచ్చిన వారు కనిపించకుండా పోతున్నారు. వారిని పట్టుకోవడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది. ఇప్పుడు ఈ సమస్య బెంగుళూరు అధికారులను పట్టుకుంది.

కరోనా వైరస్‌ సోకిన 3,338 మంది బెంగళూర్‌లో కనిపించకుండా పోయారు. బెంగళూర్‌లో గత రోజుల వ్యవధిలోనే 27 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మొత్తం కేసుల్లో ఏడు శాతం మంది కనిపించకుండా పోవడం అధికారుల్లో ఆందోళనలను పెంచుతుంది.

వీరిని త్వరగా పట్టుకోలేకపోతే వీరి ద్వారా మరింత మందికి కరోనా విస్తరించే అవకాశముంది. తాము చాలా ప్రయత్నించినప్పటికీ వారి జాడ కనిపెట్టలేకపోయామని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.

పరీక్షల కోసం శాంపిల్స్‌ ఇచ్చే సయమంలో కొంతమంది తప్పుడు మొబైల్‌ నెంబర్‌, తప్పుడు అడ్రస్‌ ఇచ్చారని, పాజిటివ్‌ వచ్చిందని వారికి తెలియగానే వారు కనిపించకుండా పోయారని కమిషనర్‌ మంజూనాథన్‌ ప్రసాద్‌ తెలిపారు.