1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Corona cases in Andhra pradesh

ఏపీలో కొత్తగా మూడు వేల కేసులు.. 38మంది మృతి

Corona
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 3,841 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 38 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు 18,93,354కి చేరగా, కరోనాతో 12,744 మంది మరణించారు.

అలాగే 38,178 కరోనా యాక్టివ్‌ కేసులు ఉండగా, గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 3,963 మంది రికవరీ అయ్యారు. కరోనాతో కృష్ణా జిల్లాలో 8 మంది మృతి చెందారు. 
 
చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో ఐదుగురు చొప్పున, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, అనంతపురం, కడప, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కర్నూలు, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
వరుడు నచ్చలేదు.. పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయిన వధువు