గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 జులై 2021 (16:30 IST)

డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌కు షాకిచ్చిన కేంద్రం.. స్పుత్నిక్ ట్రయల్స్‌కు నో

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న డాక్టర్ రెడ్డీస్ లెబోరోటరీకి కేంద్రం ప్రభుత్వం షాకిచ్చింది. దేశంలో స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌కు అనుమతిని నిరాకరించింది. కరోనా వ్యాక్సిన్లపై కేంద్రం ఏర్పాటు చేసిన సబ్జెక్ట్ నిపుణుల కమిటీ (ఎస్ఈసీ) నిపుణులు స్పుత్నిక్ లైట్ ట్రయల్స్‌కు అనుమతులపై బుధవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
వ్యాక్సిన్‌పై మూడో దశ ట్రయల్స్ చేయడానికి ఎలాంటి ‘శాస్త్రీయ హేతుబద్ధత’ కనిపించట్లేదని, కాబట్టి రెడ్డీస్ దరఖాస్తును పరిశీలించాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడినట్టు అధికారులు చెబుతున్నారు.
 
'రెడ్డీస్ ట్రయల్స్ చేయాలనుకుంటున్న స్పుత్నిక్ లైట్.. స్పుత్నిక్ వీలో మొదటి డోసే. అంతకుముందు స్పుత్నిక్ వీకి సంబంధించి రెండు డోసుల వ్యాక్సిన్ ప్రభావం గురించి ముందే తెలిసింది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ డేటా చూస్తే అది అంత ప్రభావవంతం కాదని తేలింది. కాబట్టి స్పుత్నిక్ లైట్ పై మరోసారి ట్రయల్స్ చేసేందుకు ఎలాంటి హేతుబద్ధత కనిపించట్లేదు' అని నిపుణులు పేర్కొన్నట్టు తెలుస్తోంది.