శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

కిష్టమ్మ చెరువులో దూకి డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

deadbody
కడప జిల్లా రాజంపేట మండలానికి చెందిన డిగ్రీ విద్యార్థి ఒకరు కిష్టమ్మ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విద్యార్థి బలవన్మరణానికి కారణాలు తెలియరాలేదు. 
 
చిట్వేలి మండలం మరాటిపల్లికి చెందిన రెడ్డయ్య రాజంపేటలోని ఓ ప్రైవేటు డిగ్రీ కాలేజీలో బీకామ్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ విద్యార్థి మూడు రోజుల క్రితం కాలేజీకి వెళ్ళి వస్తానని చెప్పి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో రెడ్డయ్య కోసం కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో గాలించారు. 
 
అయితే, రెడ్డయ్య మృతదేహం కిష్టమ్మ చెరువులో గుర్తించారు. మృతదేహాన్ని చూసిన కుటుంబం సభ్యులు బోరున విలపించారు. అయితే, ఈ విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.