1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Devaragattu Karrala samaram 100 people injured

దేవరగట్టులో కర్రలతో కొట్టుకున్న గ్రామస్థులు - 9 మందికి విషమం

Devaragattu Karrala Samaram
అనాదిగా వస్తున్న ఆచారాల్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా దేవరగట్టులో కర్రల పండుగ జరిగింది. ఇక్కడ ఉన్న దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి ఆలయ వేడుకల్లో భాగంగా, ఈ కర్రల పండుగ జరిగింది. ఇందులో హింస చెలరేగింది. 
 
గత అర్థరాత్రి స్వామివారి దసరా బన్ని జైత్రయాత్ర ప్రారంభం కాగా, ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపు, అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం గ్రామాల భక్తులు ఒకవైపు విడిపోయి కర్రలతో తలపడ్డారు. 
 
అనాదిగా వస్తున్న ఆచారాల్లో భాగంగా ఈ వేడుక జరిగింది. ఈ వేడుకలో రెండు వర్గాల గ్రామస్థులు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడులో 100 మందికిపైగా భక్తులకు గాయాలయ్యాయి. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆలూరు, ఆదోని, కర్నూలు ఆసుపత్రులకు తరలించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి...