బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (08:51 IST)

అమెరికాలో ఆగని కాల్పుల మోత - ఇద్దరు మృతి

అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ కాల్పుల సంస్కృతి మరింతగా హెచ్చుమీరిపోతోంది. మంగళవారం ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోస్టల్‌ సర్వీస్‌ ఉద్యోగులు మృతిచెందారు. 
 
అమెరికాలోని మెమ్‌ఫిస్‌లోని టెన్నెస్సీ పోస్టాఫీస్‌లో ఓ వ్యక్తి విచక్షణారహితంగా ఈ కాల్పులకు తెగబడ్డాడు. దీంతో యూఎస్‌ పోస్టల్‌ సర్వీస్‌ ఉద్యోగులు ఇద్దరు చనిపోయారు. అయితే కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా పోస్టల్‌ ఉద్యోగే కావడం గమనార్హం. 
 
కాల్పులు జరిపిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతనికోసం పోలీసులు గాలిస్తున్నట్టు పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ సుసాన్‌ తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని చెప్పారు.
 
కాగా, ఇటీవలి కాలంలో అమెరికాలో కాల్పులకు పాల్పడటం సర్వ సాధారణమైపోయింది. దేశంలో ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో దుండగులు తుపాకీతో విరుచుకుపడుతూనే ఉన్నారు. ఈ కాల్పుల్లో పలువురు అమాయక ప్రజలు, అధికారులు ప్రాణాలు కోల్పోతున్నారు.