గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 10 అక్టోబరు 2021 (18:55 IST)

ఐసిస్‌తో తాలిబన్లకు తలనొప్పి.. అమెరికా సాయం వద్దంటూ..?

ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. తమ పాలనను ప్రారంభించారు. వారి పాలనలో కొత్త కొత్త ఆంక్షలతో ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలకు పూనుకున్నారు. అయితే, అప్పటి వరకు బాంబులు, దాడులతో దద్దరిల్లిన ఆఫ్ఘన్ ఇక ప్రశాంతంగా ఉంటుందని కొందరు భావించినా.. మరోవైపు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారు. దాడులకు పాల్పడుతూ మారణహోమం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐసిస్ కట్టడికి తాలిబన్లకు సహాయం అవసరం అనే వాదన కూడా ఉంది.
 
కానీ, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కట్టడికి తమకు అమెరికా సాయం అక్కర్లేదని స్పష్టం చేశారు తాలిబన్లు.. కతార్ రాజధాని దోహాలో తాలిబన్ నేతలు, అమెరికా ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి.. ఈ సందర్భంగా తాలిబన్ అధికార ప్రతినిధి సుహాయిల్ షహీన్ తమ వైఖరిని స్పష్టం చేశారు.
 
ఆఫ్ఘనిస్థాన్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులకు తమదే బాధ్యత అని ఐసిస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే కాగా.. తాలిబన్లు మాత్రం.. తమకు ఎవరి సాయం అవసరం లేదు.. మేం చూసుకుంటామని ప్రకటించారు.