1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. electricity true up charges should be bared by state government only

ట్రూ అప్ ఛార్జీలేంటి? విద్యుత్ లోటును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి

electricity
విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్ర‌జ‌లకు ఛార్జీల మోత మోగిస్తున్నార‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమ‌ర్శించారు. అస‌లు ఈ ట్రూ అప్ ఛార్జీలేంటి? విద్యుత్ లోటును రాష్ట్ర ప్రభుత్వమే భరించాల‌ని ఆయ‌న డిమాండు చేశారు. విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలను వ్యతిరేకిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ నిరసనలు ప్రారంభించింది. 
 
గత 27 నెలల కాలంలో రూ.9 వేల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై వేసిన ప్రభుత్వం, మరోసారి సర్దుబాటు చార్జీలపేరుతో రూ.3,669 కోట్లు భారం మోపింద‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. 2019-20కు టారిఫ్ వ్యత్యాసం పేరుతో మరో రూ2,542 కోట్ల సర్దుబాటుకు అవకాశం ఇవ్వాలని విద్యుత్ రెగ్యులేటరీ కమీషన్కు పిటిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంద‌ని, ఇలా కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు రాష్ట్రప్రభుత్వం సై అనటం దుర్మార్గం అని ఆయ‌న అన్నారు. విద్యుత్ సర్దుబాటు చార్జీలు ఉపసంహరించాల‌ని, విద్యుత్ లోటును రాష్ట్ర ప్రభుత్వమే భరించాల‌ని ఆయ‌న డిమాండు చేశారు. 
తర్వాతి కథనం
నిత్యావసర సరకులు డెలివరీకి జొమాటో స్వస్తి