బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (11:14 IST)

విద్యుత్‌ వినియోగదారులకు మరో షాక్‌?

2014-15 నుంచి 2018-19 వరకు అయిదేళ్ల కాలానికి ట్రూఅప్‌ కింద రూ.3,669 కోట్ల భారాన్ని ఇప్పటికే వినియోగదారులపై వేసిన ఏపీ విద్యుత్‌ పంపిణీ సంస్థలు మరో సర్దుబాటు (ట్రూఅప్‌)కు సిద్ధమయ్యాయి.

2019-20లో టారిఫ్‌లో అనుమతించిన వ్యయానికి.. వాస్తవ ఖర్చులకు మధ్య వ్యత్యాసం రూ.2,542.70 కోట్లుగా తేల్చాయి.

ఇందులో దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్‌పీడీసీఎల్‌) రూ.1,841.58 కోట్లు, తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) రూ.701.12 కోట్ల సర్దుబాటుకు అవకాశమివ్వాలని ఇటీవల ఏపీఈఆర్‌సీకి ట్రూఅప్‌ పిటిషన్‌ను దాఖలు చేశాయి.

దీనిపై విచారించి వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరాయి. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత.. ఎంతమేర సర్దుబాటుకు అనుమతించాలో ఏపీఈఆర్‌సీ నిర్ణయం తీసుకోనుంది.

ఇప్పటికే అనుమతించిన రూ.3,669 కోట్ల ట్రూఅప్‌నకు సంబంధించి ఈ నెల బిల్లు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. తాజా సర్దుబాటును అనుమతిస్తే ఈ భారం మరింత పెరగనుంది.