గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (15:13 IST)

ఛార్జీలు తగ్గించకపోతే, మహిళలే చీపుర్లతో తరిమికొడతారు

రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుపై టీడీపీ నేత బోండా ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ట్రూ అప్ పేరిట కరెంట్ ఛార్జీలు రెట్టింపు చేశారన్నారు. వైసీపీ కమీషన్ల కక్కుర్తితో రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెరిగాయని విమర్శించారు. ఛార్జీలు తగ్గించకపోతే. మహిళలే వైసీపీ నేతలను చీపుర్లతో తరిమికొడతారని హెచ్చరించారు.

పదవి కోసం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. వెల్లంపల్లి మంత్రి పదవి రెండు నెలల్లో ఊడిపోతుందని అన్నారు. వైఎస్ వర్థంతికి అడ్డురాని కరోనా నిబంధనలు, గణేష్ ఉత్సవాలకు అడ్డువస్తాయా అని బోండా ఉమ‌ ప్రశ్నించారు.

ఏం చేసినా రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి. చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాలని బోండా ఉమ పిలుపునిచ్చారు.