1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 26 ఆగస్టు 2021 (09:33 IST)

ఐదుగురికి కరోనా వస్తే మూసేయండి: రాష్ట్ర ప్రభుత్వానికి ఆరోగ్యశాఖ సూచన

ఏ పాఠశాలలో అయినాసరే ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ వస్తే వెంటనే ఆ పాఠశాలను  మూసివేయాలని వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో కరోనా సోకిన విద్యార్థుల సంఖ్య కలవరపెడుతున్న నేపథ్యంలో వైద్యశాఖ  తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఏ పాఠశాలలో అయినా సరే ఐదుగురు విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ అయితే వెంటనే ఆ పాఠశాలను మూసి వేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పదిహేను రోజుల  క్వారంటైన్ ముగిసేవరకు పాఠశాలను మూసే ఉంచాలని పేర్కొంది ఈ మేరకు వైద్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది.