1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (12:30 IST)

24 గంటల్లో భారత్‌లో కొత్తగా 25,467 కేసులు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 25,467 కరోనా కేసులు నమోదయ్యాయి. 354 మంది మృతి చెందగా.. 39,586 మంది చికిత్స నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 
 
దేశంలో మొత్తం ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 3,24,74,773కి చేరింది. 3,17,20,112 మంది కోలుకోగా.. 4,35,110 మంది మృతి చెందారు. ప్రస్తుతం 3,19,551 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. 
 
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 58,89,97,805 మందికి టీకా పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది