మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (20:19 IST)

బొబ్బిలిలో కరోనా కలకలం...10మంది మున్సిపల్ విద్యార్థులకు పాజిటివ్

బొబ్బిలిలో కరోనా కలకలం రేపింది. జయప్రకాష్ మున్సిపల్ పాఠశాలలో 26మంది విద్యార్థులకు మంగళవారం కరోనా పరీక్షలు చేయగా 10మందికి పాజిటివ్ వచ్చింది.

10మంది విద్యార్థులకు పాజిటివ్ రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులలో టెన్షన్ మొదలైంది. పాఠశాలలో 160మంది విద్యార్థులు చదవగా ఏడుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు.

వీరిలో 26మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా 10మందికి పాజిటివ్ రావడంతో అన్ని పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థులు నాలుగో తరగతి చదువుతున్నట్లు ప్రధానోపాధ్యాయరాలు బి.శారదా తెలిపారు.