1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Heartbreaking: Young PK Fan Niranjan Passes Away

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ మృతి...

pawan kalyan - niranjan
తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ అనే 17 యేళ్ల బాలుడు ఇకలేడు. అరుదైన జన్యువ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన నిరంజన్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో మంగళవారం రాత్రి కన్నుమూశాడు. నిరంజన్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అనే విషయం తెల్సిందే. తన కోరిక మేరకు హన్మకొండలోని నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్ ఇటీవల వెళ్లి పరామర్శించడంతో పాటు ఆ బాలుడు అడిగిన అన్ని రకాల వస్తువులను గంటల వ్యవధిలో కొనుగోలు చేసి ఇచ్చారు.
 
ఆ తర్వాత నిరంజన్ ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‍కు తీసుకొచ్చి ఓ ఆస్పత్రిలో చేర్చగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. 
 
కాగా, నిరంజన్‌ను కలిసినప్పుడు పవన్‌ కల్యాణ్‌ ఆత్మీయంగా హత్తుకుని ధైర్యం చెప్పారు. సెల్ఫీ తీసుకున్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదం అందజేశారు. 'తనకు కుక్కపిల్లను పెంచుకోవాలని ఉందని' నిరంజన్‌ చెప్పగా.. 'కొని పంపిస్తా చిన్నా' అంటూ హామీ ఇచ్చారు. ఆ రోజే కుక్క పిల్లను అందించారు. అలాగే 'OG 2' తీస్తే అందులో నువ్వే నా స్పెషల్ గెస్ట్' అని కలిసి సినిమా చూద్దామని పవన్ చెప్పారు. ఈలోపే ఇలా జరగడం పవన్ అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
కారుణ్య ఉద్యోగం కోసం కన్నతల్లినే చంపేసిన కుమార్తె... ఎక్కడ?