1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Heatwave alert issued for several districts in Andhra

ఒకవైపు ఎండలు.. మరోవైపు పిడుగులు.. అలెర్ట్

Rains
ఏపీలో ఒకవైపు ఎండలు మండిపోతుంటే.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండటమే ఇందుకు కారణమని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. 
 
పిడుగుల ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని, రైతులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు, రాష్ట్రంలోని 17 మండలాల్లో తీవ్ర వడగాలులు, 32 మండలాల్లో సాధారణ వడగాలులు వీస్తాయని హెచ్చరించారు. 
 
శనివారం నాడు నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత నుంచి ప్రజలు తమను తాము కాపాడుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
స్కూటీని ఢీకొన్న డీసీఎం.. కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లింది.. మహిళ మృతి