1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Husband gang rape on wife

భార్యపై భర్త గ్యాంగ్ రేప్

Husband
అనంతపురం జిల్లా కదిరిలో అమానుష ఘటన జరిగింది. భార్యపై తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యం సేవించిన ఆమె భర్త మల్లేష్ అతని స్నేహితులతో కలిసి భార్య కాళ్లు, చేతులు కట్టేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు.

ఈ ఘటన గురించి ఎవరికీ చెప్పుకోలేక బాధితురాలు రోదిస్తుండటంతో స్థానికులు ఈ విషయమై ఆరా తీయగా ఈ విషయం బయటపడింది. అంగన్ వాడీ కార్యకర్తలు అండగా నిలబడటంతో ఆమె ఈ ఘటన గురించి మీడియాకు తెలిపింది.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మల్లేష్ గతంలో కూడా ఓ బాలికను రేప్ చేసి జైలుకు వెళ్లాడు. ‘నా భర్త, అతని స్నేహితులు నా కాళ్లుచేతులూ కట్టేసి. రేప్ చేశారు’ అంటూ ఆ ఇల్లాలు మీడియా ముందు బోరుమంది. ఈ ఘటనపై మహిళ సంఘాలు భగ్గుమంటున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.
About Writer
ఎం
తర్వాతి కథనం
ఆంగ్లమాధ్యమంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు