మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 15 అక్టోబరు 2019 (08:33 IST)

భార్య మీద కోపంతో బైకులు, కారు తగలబెట్టేసిన భర్త

అత్తమీద కోపం దుత్త మీద చూపినట్లు ఓ భర్త భార్య మీద కోపం మరోలా చూపించాడు. సంజీవ రెడ్డి నగర్(ఎస్ఆర్ నగర్) పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ నగర్‌లో ఓ వ్యక్తి తన భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో ఇంటి ముందున్న బైకులు, కారును తగలబెట్టేశాడు.

సంతోష్, సబిత ఇద్దరూ దంపతులు కాగా కుటుంబ కలహాలతో సబిత తన పుట్టింటికి వెళ్లింది. ఈరోజు సబిత పుట్టింటికి వెళ్లిన భర్త సంతోష్ ఇంటి ముందు నిలిపి ఉన్న రెండు బైకులు, ఒక కారుకు నిప్పటించాడు. సంతోష్ భార్య సబిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలికి వచ్చి సంతోష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 
రోకలి బండతో మోది భార్యను హత్యచేసిన భర్త
గండిపేట మండలం, నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హైదర్ష్‌కోట్‌లో కాంతయ్య అనే వ్యక్తి తన భార్య శ్రీదేవిని అతి కిరాతకంగా చంపేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో రోకలిబండతో తలపై బలంగా మోది హత్యచేశాడు.

ఈ ఘటనలో ఆమె తీవ్ర రక్త స్రావంతో అక్కడికక్కడే మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి హంతకుడు కాంతయ్యను విచారిస్తున్నారు.