శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 2 అక్టోబరు 2019 (15:50 IST)

సెలవులకు ఊరెళ్తున్నారా.. కాస్త జాగ్రత్త

దసరా సెలవు లకు ఇళ్ళకు తాళాలు వేసి కుటుంబంసహా ఊరు వెళ్ళేవారు ముందు జాగ్రత్తచర్యలు తీసుకోవాల్సిన అవసరంఉంది.. ఎప్పుడెప్పుడు ఇళ్ళకుతాళాలు పడతాయా, పగలగొ డదామా అంటూ ఎదురుచూసే దొంగలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి... ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మీరు ఊరెళ్ళి వచ్చేలోగా తాళా లు పగులుతాయి...

బీరువాలోని ఆభరణాలు, సొమ్ము మాయంఅవుతాయి.. ముఖ్యంగా దొం గలు దసరా, సంక్రాంతి, వేసవి సెలవుల కోస మే ఎదురుచూస్తుంటారు. చోరీల నియంత్ర ణకోసం పోలీసుశాఖ ఏర్పాటుచేసిన లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌(ఎల్‌హెచ్‌ఎం ఎస్‌) అందుబాటులో ఉంది. ఇంటికి తాళం వేసిన మొదలు తిరిగి వచ్చేవరకు పోలీస్‌ శాఖ డేగకళ్ళతో ఆ ఇంటిపై నిఘా ఉంచు తుంది. ఎవరైనా చోరికి యత్నిస్తే పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటారు.
 
ఎల్‌హెచ్‌ఎంఎస్‌ వినియోగించుకునే వారు నిశ్చింతగా ఊరువెళ్ళి రావచ్చు. తాళంవేసిన ఇళ్ళపై మూడోకన్ను ఉంటుంది. కుటుంబం తో ఊరు వెళ్ళినవారు ఇకనుంచి చీకూ చింతా లేకుండా ఉండవచ్చు. తాళం వేసి ఉన్న ఇళ్ల పర్యవేక్షణ(ఎల్‌హెచ్‌ఎంఎస్‌)విధానం ద్వారా చోరీలకు చెక్‌పడనుంది.

అర్బన్‌ జిల్లా పరిఽ దిలో ఈ యాప్‌ను 2017 ఆగస్టు 13న ఆవి ష్కరించారు. అయితే 2018నుంచి ఇది పూర్తి స్థాయిలో పని చేయడం ప్రారంభమైంది. ప్రస్తుతం పెరిగిన సాంకేతిక పరి జ్ఞానం దృష్ట్యా దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో అండ్రాయిడ్‌ ఫోన్‌ సర్వసాధారణం అయింది. అయి తే, ప్రజలు ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను ఇంతవరకు పూర్తిస్థాయిలో సద్వి నియోగం చేసుకోలేదనే చెప్పాలి. పెద్ద ఎత్తున పోలీసు లు దీనిపై ప్రచారం చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదు.
 
జిల్లావ్యాప్తంగా ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌పై అర్బన్‌ జిల్లాపరిధిలో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సిస్టమ్‌ ద్వారా సమాచారం వచ్చిన వెంటనే సంబం ధిత పోలీసు అధికారులు, సిబ్బందిని అప్ర మత్తం చేస్తున్నారు.

సీఐ వీరానాయక్‌ ఆధ్వ ర్యంలో మహిళా ఎస్‌ఐ భాగ్యలక్ష్మి, కానిస్టేబు ల్‌ శ్రీనివాసరావు, హోంగార్డులు రాజా, డ్రైవర్‌ నాగరాజు తదితరులు ప్రతి రోజూ అర్బన్‌ పరిధిలో వివిధ ప్రాంతాల్లో ఎల్‌హెచ్‌ఎంఎస్‌ పై ప్రజలు అవగాహన కల్పిస్తున్నారు. కం ట్రోల్‌ రూమ్‌లో హెడ్‌కానిస్టేబుల్‌ విద్యాసా గర్‌, కానిస్టేబుళ్ళు గోపీకృష్ణ, వీర్రాజు తదిత రులు పర్యవేక్షిస్తున్నారు.
 
ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే...
గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఎల్‌హెచ్‌ఎంఎస్‌ ఏపీ పోలీస్‌ అనే యాప్‌ను ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్‌(ఇన్‌స్టాల్‌) చేసుకోవాలి. ఎల్‌హెచ్‌ ఎంఎస్‌ యాప్‌ ఓపెన్‌చేసి యజమాని పేరు, ఫోన్‌ నెంబర్‌, జిల్లా, ఇంటి నెంబరు, అడ్రస్‌ తదితర వివరాలు నమోదు చేయాలి. దీంతో రిజిస్ట్రేషన్‌ను కన్ఫార్మ్‌ చేసుకునేందుకు ఓటీపీ మెసేజ్‌ వస్తుంది.

మెసేజ్‌లోని ఓటీపీని ఎం టర్‌ చేస్తే యూజర్‌ ఐడీ వస్తుంది. దీనిని మర్చిపోకుండా ఎప్పటికి గుర్తుండేలా భద్రపర్చుకోవాలి. తద్వారా ఎల్‌హెచ్‌ఎంఎస్‌లో తమపేర్లు నమోదవుతాయి.
 
ఎవరైనా ఊరు వెళ్తుంటే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న వారు స్థానిక పోలీసులకు ఫోన్‌ ద్వారా గానీ లేదంటే యాప్‌ ద్వారా కానీ సమాచారం పంపవచ్చు. మొబైల్‌ యాప్‌నుంచి రిక్వెస్ట్‌ పోలీస్‌ వాచ్‌ ద్వారా యూజర్‌ ఐడీని ఎంటర్‌ చేసి అందులో స్టార్ట్‌ డేట్‌ అండ్‌ టైమ్‌, ఎండ్‌ డేట్‌ అండ్‌ టైమ్‌ను నమోదు చేసుకుని పోలీసు సహాయం కోరవచ్చు.

దీంతో పోలీసులు వారింటికి వచ్చి అత్యాధునిక పరిజ్ఞానం కలిగిన కెమెరాను ఓ రహస్య ప్రాంతంలో అమరుస్తారు. ఇది రాత్రి సమయంలోను స్పష్టంగా దృశ్యాలను చిత్రీకరిస్తుంది. నిరంతరాయంగా మూడు రోజుల పాటు రికార్డింగ్‌ స్టోరేజీ ఉంటుంది. యాప్‌ ద్వారా సమాచారం ఇవ్వలేని వారు డయల్‌ 100కు గానీ, స్థానిక పోలీస్‌స్టేషన్‌కు గాని ఫోన్‌ చేసి చెబితే పోలీసులే ఇంటికి వచ్చి కెమెరాను అమర్చి నిఘా ఉంచుతారు.
 
తాళం వేసి ఉన్న ఇంటికి పోలీసులు ఎల్‌హెచ్‌ఎంఎస్‌ విధానంలో నిఘాకెమెరా అమర్చిన తరువాత ఎవరైనా దొంగలు కానీ అపరిచిత వ్యక్తులు కానీ లోనికి ప్రవేశిస్తే వెంటనే ఇంటి యజమాని సెల్‌ఫోన్‌కు సమాచారం వెళ్తుంది. పోలీసు కంట్రోల్‌ రూమ్‌కి కూడా సమాచారం వస్తుంది.

ఫలానా ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించినట్లు అలారం మోగుతుంది. వెంటనే కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది రక్షక్‌ లేదా స్థానిక పోలీసులను, బీటు సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. మరో వైపు కంట్రోల్‌ రూమ్‌ నుంచే సిబ్బంది ఆ ఇంట్లోకి ఎవరు ప్రవేశించారు, అక్కడ పరిస్థితి ఏమిటనేది తమ వద్ద ఉన్న ఎల్‌ఈడీ టీవీల్లో పరిశీలిస్తూ ఉంటారు.
 
రూరల్‌ జిల్లాలో లాక్డ్‌ హౌస్‌ సర్వైలెన్స్‌ యాప్‌
రూరల్‌ జిల్లా పరిధిలో తాళం వేసిన ఇం డ్లల్లో చోరీలను అరికట్టేందుకు గతంలో రూర ల్‌ ఎస్పీగా పనిచేసిన రాజశేఖర్‌బాబు ఎల్‌ హెచ్‌ఎంఎస్‌ తరహాలో మరోయాప్‌కు రూప కల్పనచేశారు.

అయితే ఈ యాప్‌ పూర్తిగా పోలీసుశాఖకు సంబంధించిందే...ప్రజలు తమ ఇంటికి తాళంవేసి ఊరు వెళితే పోలీసులే ఆ ఇంటిని గుర్తించి వారువచ్చేవరకు సాంకే తిక పరిజ్ఞానం ద్వారా నిఘా ఉంచడమే లాక్డ్‌ హౌస్‌ సర్వ్‌లెన్స్‌ యాప్‌ ప్రధాన ఉద్దేశం. ఈ యాప్‌ రూరల్‌ జిల్లా పరిధిలో ఎంపికైన ఈ పహారా సిబ్బంది వినియోగిస్తారు.

రూరల్‌లో లాక్డ్‌హౌస్‌ సర్వైలెన్స్‌తోపాటు ఎల్‌హెచ్‌ఎం ఎస్‌ కూడా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యం లో ఇళ్ళకు తాళాలు వేసి ఊరు వెళ్ళేవారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసుఅధికారులు సూచిస్తున్నారు.
 
ఎల్‌హెచ్‌ఎంఎస్‌ వినియోగించుకోని వారు కనీసం ఇంట్లో విలువైన ఆభరణాలు, సొత్తు లేకుండా చూసుకోవాలని పోలీసు అధికారు లు కోరుతున్నారు. అంతేకాక కనీసం ఒకరైనా ఇంట్లోఉండేలా చూసుకోవాలని అంటున్నారు.

సాధ్యం కానప్పుడు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. స్థానిక పోలీ సులకు సమాచారం ఇస్తే రాత్రి వేళ గస్తీ పోలీసులు ఆ ఇంటిపై ప్రత్యేక నిఘా ఉంచు తామని పోలీసు అధికారులు చెబుతున్నారు.