ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2019 (13:33 IST)

ఫిలిప్పీన్స్‌‌‌‌లో ఘోర పడవ ప్రమాదాలు-31 మంది మృతి

ఫిలిప్పీన్స్‌‌‌‌లో ఘోర పడవ ప్రమాదాలు జరిగాయి. ఒక్కసారిగా పెను గాలులు వీయడంతో మూడు పడవలు తిరగపడ్డాయి. ఈ ప్రమాదంలో 31 మంది చనిపోయారు. 62 మందిని కోస్ట్‌‌‌‌ గార్డ్‌‌‌‌లు కాపాడి తీరానికి చేర్చారు. రెండు పడవల్లోని ప్యాసింజర్లు చనిపోయారని, మరో పడవలో ప్రయాణికులు లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు.
 
వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చి భారీ గాలులు వీచాయని, భారీ వర్షం పడటంతో బోట్లు ఒక్కసారిగా తిరగబడ్డాయన్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.