బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 7 నవంబరు 2019 (19:29 IST)

భార్య టిక్‌టాక్ వీడియోలు, ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుందనీ...

టిక్‌టాక్ మరో ప్రాణాన్ని బలితీసుకుంది. వద్దన్నా టిక్‌టాక్ వీడియోలు చేస్తోందంటూ.. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చంపేసిన ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో కలకలం రేపుతోంది.

కనిగిరి మండలం, తాళ్లూరుకు చెందిన ఫాతిమా కనిగిరిలో టైలర్ పనిచేసే పాచ్చును వివాహం చేసుకుంది. ఫాతిమాకు టిక్‌టాక్ వీడియోలు చేసే అలవాటు ఉంది. ఇది పాచ్చుకు నచ్చలేదు. దీంతో ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.

ఫాతిమా ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుందని పాచ్చు అనుమానించడంతో గొడవలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో ఫాతిమా అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఉరి వేసుకుని చనిపోయిందని మొదట పాచ్చు చెప్పాడు. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. 
 
ఫాతిమాను పాచ్చునే హత్య చేసినట్లు తేలింది. బార్యను చపాతి చేసే కర్రతో తలపై కొట్టి, గొంతుపై నొక్కిపట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.