సంబంధిత వార్తలు
- ఓ వివాహిత.. ముగ్గురు ప్రియులు.. టార్చర్ భరించలేక భర్త కరెంట్ వైర్లు పట్టుకుని...
- గోధుమలంటే అలర్జీ.. రొట్టెలు తింటే తలనొప్పి... యువతి సూసైడ్
- ఆ కంపెనీ యజమానులు వేధిస్తున్నారు... యువకుడు ఆత్మహత్య
- తల్లిదండ్రులను సాగనంపేందుకు వచ్చి.. రైలు నుంచి కిందపడ్డాడు.. అంతే?
- స్మార్ట్‌ఫోన్ ఇవ్వలేదని చెల్లితో గొడవ.. తండ్రి మందలించాడని ఆత్మహత్య
భార్య కాపురానికి రావట్లేదని టెక్కీ సూసైడ్.. ఎక్కడ?
హైదరాబాద్ నగరంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. కట్టుకున్న భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
హైదరాబాద్, జియాగూడ క్రాంతిభవన్‌కు చెందిన జి. కమలేష్ (40), శ్రీవిద్య అనే దంపతులు ఉన్నారు. వీరికి పదేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు. కమలేష్ హైటెక్ సిటీలోని ఐబీఎం కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు.
అయితే, గత మూడేళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో శ్రీవిద్య పుట్టింటికి తన కుమారుడుతో కలిసి వెళ్లిపోయింది. ఆ తర్వాత కాపురానికి రావాలంటూ కమలేష్ పలుమార్లు భార్యను కోరాడు. కానీ, ఆమెవైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మనస్తాపం చెందిన కమలేష్ తన ఇంట్లోని పడకగదిలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు.
గత నాలుగు రోజులుగా కమలేష్ ఉంటున్న ఇంటి తలుపులు తీయకపోవడం, ఇంటి ముందు నాలుగు రోజుల పేపర్లను గమనించిన స్థానికులు తలుపులను తెరిచేందుకు ప్రయత్నించారు. తలుపు గడియ వేసి ఉండటంతో గడియ పగులగొట్టి చూసే సరికి బెడ్ రూంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. దీంతో స్థానికులు కుల్సూంపుర పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
