శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 19 డిశెంబరు 2018 (15:13 IST)

ఓ వివాహిత.. ముగ్గురు ప్రియులు.. టార్చర్ భరించలేక భర్త కరెంట్ వైర్లు పట్టుకుని...

ఓ వివాహిత తన ముగ్గురు ప్రియులతో కలిసి భర్తను పలు రకాలుగా చిత్ర హింసలు పెట్టింది. ఈ వేధింపులు తాళలేని ఆ భర్త తీవ్ర మనస్తాపానికి గురై కరెంట్ వైర్లు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రాజ్‌కోట్‌లోని గాంధీరామ్ అనే ప్రాంతానికి చెందిన ప్రహ్లాద్, ధన్‌భాయి మహేశ్వరి అనే దంపతులు ఉన్నారు. అయితే, మహేశ్వరికి అదే ప్రాంతానికి చెందిన నర్సింహ్, రవిశంకర్, మహేశ్‌ అనే ముగ్గురు వ్యక్తులతో వివాహేతర సంబంధం ఏర్పడింది. 
 
ఈ ముగ్గురుతో కలిసి భర్తను వేధించసాగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ప్రహ్లాద్, కరెంట్ వైర్లు పట్టుకున్నాడు. తీవ్ర విద్యుతాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రహ్లాద్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భార్యతో పాటు ఆమె ముగ్గురు ప్రియులపై కేసు నమోదుచేశారు.