శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 21 డిశెంబరు 2018 (08:48 IST)

బ్యూటీషియన్ కోర్చు నేర్పిస్తానని బాలికలతో వ్యభిచారం...

ఉపాధి పేరుతో పలువురు అమ్మాయిలు మోసపోతున్నారు. తాజాగా బ్యూటీషియన్ కోర్సు పేరుతో ఇద్దరు అమ్మాయిలను వ్యభిచారం చేయించిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ రాజేంద్ర నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని హకీం హైట్స్‌కు చెంది సర్ఫరాజ్ (26), అతని భార్య ముష్కిన్‌లు గత అక్టోబరు నెలలో బంగ్లాదేశ్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరు అమ్మాయిలకు బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తామంటూ బాలికల తల్లిదండ్రులను నమ్మించి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. 
 
ఆ తర్వాత హకీం హైట్స్‌లోని తమ నివాసంలోనే ఆ ఇద్దరు అమ్మాయిలతో సర్ఫరాజ్ బలవంతంగా వ్యభిచారం చేయించాడు. ఈ క్రమంలో ఓ బాలిక వారి చెర నుంచి తప్పించుకుని రాజేంద్ర నగర్ పోలీసులను ఆశ్రయించింది.
 
తమకు జరిగిన అన్యాయాన్ని ఇన్‌స్పెక్టర్‌కు బోరున విలపిస్తూ చెప్పింది. దీంతో ప్రత్యేక బృందం పోలీసులు మఫ్టీలో ఆ బాలిక ఇచ్చిన అడ్రస్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సర్ఫరాజ్‌ను అరెస్టు చేశారు. రెండో బాలిక ఎక్కడ ఉందని నిలదీస్తే పూణెకు చెందిన అనిరుధ్ అనే వ్యక్తికి విక్రయించినట్టు చెప్పాడు. దీంతో సర్ఫరాజ్‌ను అరెస్టు చేసి, అతని భార్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధిత బాలికను కాచిగూడలోని స్టేట్ హోంకు తరలించారు.