మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 27 జూన్ 2020 (09:55 IST)

బాధ్యత రాహిత్యానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్: దేవినేని ఫైర్

బాధ్యతా రాహిత్యానికి బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి జగన్ అని టీడీపీ నేత, మాజీ మంత్రి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. "జగన్ బాధ్యత రహిత్యం, అవగాహన రహిత్యం వల్ల పోలవరం పనులు పడకేశాయి. 
 
పోలవరం ప్రాజెక్ట్ పనులను వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాకా నత్తనడకన సాగుతున్నాయి, విలువైనా సీజన్ సమయాన్ని పోగొట్టి ఆంధ్ర జీవ నాడి పోలవరాన్ని నిర్వీర్యం చేయడానికి వైసీసీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది.

2019 నాటికి పూర్తి చేయవలసిన గేట్ల నిర్మాణాన్ని స్వార్ధ ప్రయోజనాలు, కక్ష సాధింపుల కోసం రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వ్ టెండరింగ్ డ్రామాలు అడుతున్నారు.
 
గైడ్ లైన్స్ ఏమి ఫాలో అవ్వకుండా ఒకే ఒక్క కంపేనికి టెండర్ ఇచ్చి టీడీపీ మీద కక్ష సాధించడం కోసం పోలవరాన్ని ఆంధ్రలకు శాపంగా మార్చారు. 
 
2019లో ఉత్తమ జాతీయ ప్రాజెక్ట్ గా పేరు తెచ్చుకున్నా పోలవరం 2020లో ఎందుకు పేరు తెచ్చుకొలేక పోయింది. అనుభవ రాహిత్యంగా పోలవరం ఎత్తు పెంచి ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు. 
 
పోలవరం ఇరిగెషన్ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో జగన్ ప్రభుత్వం ఇష్టాను రాజ్యంగా వ్యవహారిస్తుంది. ఇంజరింగ్ చీప్ లు, లేకుండా డ్యామ్ నిర్మాణ పనులు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. రాష్ట్రానికి గుండెకాయ లాంటి ప్రాజెక్ట్ ను గాలికి వదిలి వేసి ప్రచార అర్భాటాల కోసం ప్రాకులాడుతున్నారు.

గతంలో ఎప్పటి కప్పుడు పోలవరం డ్యామ్ పనులను చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సందర్శించటం, ఇంజనీర్లు, ప్రజలకు తెలియజేసేవారు. గతంలో మాదిరి నేడు రాష్ట్రంలోని 62 ప్రాజెక్ట్ లకు సంబంధించిన సమాచరం ఉంచడం లేదు. 
 
పోలవరం పనుల పురోగతిని ఎందుకు దాస్తున్నారు? ఇంజనీరింగ్ చీఫ్ ఎందుకు ప్రాజెక్ట్ సైట్ లో లేరో వైకాపా నాయకులు చెప్పాలి? ప్రాజెక్ట్ లలో మీ అవీనితి ఆక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రాజెక్టుల విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు. 
 
పోలవరం టెండర్ సింగిల్ టెండర్ ఎలా అయింది? సింగిల్ టెండర్ రిజర్వ్ టెండర్ ఎలా అయింది? మీ అవినీతి,ఆక్రమ సంపాదన కోసం పోలవరాన్ని నీరుగార్చితే సహించేది లేదు.  
 
పోలవరం పవర్ ప్రాజెక్ట్ తో ఇరిగెషన్ ప్రాజెక్ట్ తో అటలాడుకునే అధికారం మీకు ఏవరు ఇచ్చారు.. రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకోని పోలవరం పవర్ ప్రాజెక్ట్, స్పిల్వే పనులను అడ్డుకున్నారు. 
 
ట్రాన్ స్ట్రాయ్, నవయుగలు 28.3 లక్షల క్యూభిక్ మీటర్ల కాంక్రిట్ వేస్తే సాక్షి పత్రిక, టీవీల్లో తప్పుడు ప్రచారాలు చేశారు.  చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం వారంగా మర్చుకొని పనులను పరిగెత్తించారు. 
 
జగన్ మోహన్ రెడ్డి మాత్రం ప్రకాష్ రెడ్డి, దనుంజయ్ రెడ్డి చేతుల్లో పెట్టి పోలవరంపై బాద్యతరహిత్యంగా వ్యవహరించడం సరికాదు. తెలుగుదేశం ప్రభుత్వం పోలవరాన్ని 70 శాతం పూర్తి చేశాం. 
 
జలయజ్జాన్ని దనయజ్జంగా మార్చించి రాష్ట్ర ప్రాజెక్ట్ లను ఏవిధంగా కుదేలు చేశారు.  వ్యవసాయ అనుబంధ రంగాల్లో జీడీపీ పెరిగింది తప్పా మీరు సాధించిన ప్రగతి ఏమి లేదు. 62 ప్రాజెక్ట్ లలో ఎంత కాంక్రిట్ వేశారు, ఎంత మట్టి తీశారో వైకాపా నాయకులు చెప్పాలి? 
 
వంశాధార, నాగావళి అనుసందాన్ని పరిగెత్తించింది చంద్రబాబు నాయడు.  వెలుగొండ  ప్రాజెక్ట్ ను రన్నింగ్ ప్రాజెక్ట్ గా చేసింది చంద్రబాబు జగన్ బంధువు లక్కా రెడ్డికి వెలుగొండ ప్రాజెక్ట్ ను అప్ప జెప్పి ప్రకాశం, నెల్లూరు, కడప ప్రజల నీటీ అశలకు గండి కొట్టారు. 
 
రాజప్రసాదాల మంత్రిగా సజ్జల కాంట్రాక్ట్ లతో ఒప్పందాలు కుదుర్చుకొని నీటి ప్రాజెక్ట్ లలో వాటాలు పంచుకుంటూ ఆంధ్రరాష్ట్ర ప్రజల కళ్ళల్లో కారం కొట్టి నీళ్ళులో నిధులు పంచుకుంటున్నారు. 
 
22 మంది ఎంపీలు ఉండి కూడా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలేక పోయారు. గోదావరి పెన్నా అనుసంధానం పనులు ఎందుకు అపేశారు? ఇప్పుడు ఎవరి దగ్గర కమిషన్ లు తీసుకున్నారు. పట్టిసీమ దండగన్నారు. నేడు పట్టిసీమ రైతులకు వరం అయ్యింది. 
 
జగన్ అసమర్ధ పాలనా వల్ల నదుల నుంచి వేల క్యూసెక్యుల నీరు సముద్రం పాలయ్యింది. మంత్రుల అనుచరులు పంది కొక్కులాగా ఇసుకను తొవ్వకుంటూ విషయాన్ని గుర్తు చేశారు.

ఇరిగేషన్ ప్రాజెక్ట్ లలో జరిగిన ఆక్రమాల గురించి ప్రశ్నిస్తే కేసులు పెడతారా? మంత్రుల చేత బూతులు తిట్టిస్తారా? రాజప్రసాదాల మంత్రి సజ్జల వస్తారా ముఖ్యమంత్రి జగన్ వస్తారా మీ అవినీతి అక్రమాల గురించి చర్చించడానికి సిద్దంగా ఉన్నాం" అని దుయ్యబట్టారు.